చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
ABN , Publish Date - Mar 28 , 2026 | 08:42 AM
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొని ముగ్గురి మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొని ముగ్గురి మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగింది. అయితే, అదే మార్గంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో మహిళ, చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు, అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. మృతులు తెలంగాణ రాష్ట్రం వరంగల్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మి, కుమార్తె అద్వికగా మృతిచెందారని తెలిపారు. బెంగళూరు నుంచి ట్యాక్సీ కార్ బుక్ చేసుకుని తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. కాగా, ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండ్రోజుల కిందట ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతికి చట్టబద్ధత.. నేడు ఏపీ అసెంబ్లీలో చారిత్రక తీర్మానం..
ఘోరం.. ప్రియుడి కోసం కన్న తండ్రినే చంపిన మహిళా పోలీస్..