Share News

చెన్నై నగరానికి కృష్ణా జలాల నిలిపివేత

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:11 PM

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా సరిహద్దుల్లో తెలుగు గంగ కాలువల్లో మరమ్మతుల కారణంగా నగరానికి కృష్ణా జలాల విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెన్నై మెట్రోవాటర్‌ బోర్డ్‌ ప్రకటించింది.

చెన్నై నగరానికి కృష్ణా జలాల నిలిపివేత

చెన్నై: తిరువళ్లూరు జిల్లా సరిహద్దుల్లో తెలుగు గంగ కాలువల్లో మరమ్మతుల కారణంగా నగరానికి కృష్ణా జలాల విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెన్నై(Chennai) మెట్రోవాటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. మరమ్మతుల అనంతరం మే నుంచి యదావిధిగా నీటి విడుదల ఉంటుందని అధికారులు తెలిపారు. తిరువళ్లూరు జిల్లా సమీపంలోని కండలేరు-పూండి కాలువల్లో తమిళనాడు-ఆంధ్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రతి ఏటా కృష్ణాజలాలను నగరానికి విడుదల చేస్తున్నారు.


nani1.2.jpgఆ రీతిలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి గురువారం వరకు విడుదల చేసిన నీటిని పుళల్‌, చెంబరంబాక్కం, పూండి, కండిగై తదితర రిజర్వాయర్లలో నింపారు. మొత్తం సామర్థ్యం 11,757 మిలియన్ల ఘనపుటడుగులు కాగా ప్రస్తుతం నిల్వవుంచిన 79 శాతం నీటిని మరో నాలుగు నెలల వరకు నగరవాసులకు సరఫరా చేయవచ్చని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

విజయవాడ రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌కు ఆటంకాలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 12:11 PM