Share News

ఆర్‌టీఓ చలాన్‌ అనుకుని...

ABN , Publish Date - Mar 28 , 2026 | 10:52 AM

ఆర్‌టీఓ ట్రాఫిక్‌ చలాన్‌ పేరుతో వచ్చిన నకిలీ (ఏపీకే) ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో ఓ విద్యార్థిని రూ.2,75 లక్షలు కోల్పోయిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.

ఆర్‌టీఓ చలాన్‌ అనుకుని...

  • ఏపీకే ఫైల్‌ ఓపెన్‌ చేసిన పీజీ విద్యార్థిని

  • రూ.2.75 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఆర్‌టీఓ ట్రాఫిక్‌ చలాన్‌ పేరుతో వచ్చిన నకిలీ (ఏపీకే) ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో ఓ విద్యార్థిని రూ.2,75 లక్షలు కోల్పోయిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్(ఐఎస్‏బీ)లో పీజీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినికి మార్చి 25 సాయంత్రం సమయంలో గుర్తు తెలియని నంబర్‌ నుంచి ‘ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే’ పేరుతో ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ట్రాఫిక్‌ చలాన్‌ నోటీసు అనుకుని ఆమె ఫైల్‌ను ఓపెన్‌ చేయగానే మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ అయింది. తర్వాత రోజు వివిధ వెబ్‌సైట్ల నుంచి వరుసగా ఓటీపీ మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది.


city7.jpgకొద్ది సేపటికే ఆమెకు చెందిన హెచ్‌డీఎఫ్‏సీ, ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుల ద్వారా నాలుగు విడతల్లో మొత్తం రూ. 2,75,000 డెబిట్‌ అయినట్లు గుర్తించారు. మోసం జరిగిన విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే సంబంధిత బ్యాంకులను సంప్రదించి క్రెడిట్‌ కార్డులను బ్లాక్‌ చేయించారు. అనంతరం నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి, సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 10:52 AM