వాటర్‌బోర్డు లోగో దుర్వినియోగం చేస్తే కేసులు
ABN , Publish Date - Mar 28 , 2026 | 10:18 AM
వాటర్‌బోర్డు అధికారిక లోగోను ప్రైవేట్ నీటి ట్యాంకర్ యజమానులు అనధికారికంగా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.
ప్రైవేటు ట్యాంకర్ల వినియోగంపై ఎండీ సీరియస్
హైదరాబాద్ సిటీ: వాటర్‌బోర్డు అధికారిక లోగోను ప్రైవేట్ నీటి ట్యాంకర్ యజమానులు అనధికారికంగా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి(Water Board MD Ashok Reddy) హెచ్చరించారు. వాటర్‌బోర్డు లోగో అనేది సంస్థ ప్రభుత్వ అధికారిక గుర్తింపు చిహ్నమని అన్నారు. తమ అనుమతి లేకుండా వినియోగించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని అన్నారు.
ఇటీవల నిర్వహించిన తనిఖీలలో ఒక ప్రైవేట్ నీటి ట్యాంకర్ వాటర్‌బోర్డు లోగోను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, లోగో దుర్వినియోగం జరిగినట్లు గమనిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
Read Latest Telangana News and National News