Share News

రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

ABN , Publish Date - Mar 28 , 2026 | 09:49 AM

టప్పాచబుత్ర పోలీస్‏స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులపై సైతం దాడులకు దిగుతూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు.

రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

  • విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లపై దాడి

  • బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలతో అసభ్య ప్రవర్తన

  • వరుస ఘటనలతో భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్: టప్పాచబుత్ర పోలీస్‏స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులపై సైతం దాడులకు దిగుతూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. వరుసగా రెండు రోజుల్లో రెండు ఘటనలు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి కుల్సుంపురా ప్రభుత్వ పాఠశాల వద్ద నుంచి బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను ముగ్గురు రౌడీషీటర్‌లు అడ్డగించారు. సదరు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై దాడిచేశారు. ఈ విషయం గమనించిన స్థానికులు టప్పాచబుత్ర పోలీసులకు సమాచారం అందించారు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్‌ కానిస్టేబుళ్లుపై సైతం కుల్సుంపురా రౌడీషీటర్‌ వికాస్‌, అతడి స్నేహితులు వరుణ్‌రావు, అరుణ్‌రావు(హుస్సేనీ ఆలం రౌడీషీటర్లు) దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. రౌడీషీటర్లు హంగామాతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై రౌడీషీటర్ల దాడితో చుట్టుపక్కలవారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఎట్టకేలకు మరికొందరు స్థానికుల సహాయంతో పోలీసులు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకొని పోలీస్‏స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.


city5.jpgమరో ఘటనలో.. బుధవారం టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ వాజీద్‌ మద్యం మత్తులో అదే ప్రాంతానికి చెందిన మాజీ రౌడీషీటర్‌ మహ్మద్‌ గౌస్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ కత్తులతో దాడి చేయడంతో మహ్మద్‌ గౌస్‌కు గాయాలయ్యాయి. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కత్తులతో స్వైరవిహారం చేస్తున్న రౌడీషీటర్‌ను ఆపేందుకు నానా తంటాలు పడ్డారు. అతికష్టం మీద వాజీద్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 09:49 AM