ఆకివీడులో హైటెన్షన్.. కూటమి నేతలపై మేకులు, రాళ్లతో దాడి
ABN, Publish Date - Mar 27 , 2026 | 02:43 PM
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకుని దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
పశ్చిమగోదావరి, మార్చి 27: జిల్లాలోని ఆకివీడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకుని దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే కూటమి నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కూటమి నాయకులపై మేకులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు.
Updated at - Mar 27 , 2026 | 02:46 PM