భరత్‌నగర్‌లో కుళ్లిన చికెన్ సరఫరా
ABN , Publish Date - Mar 28 , 2026 | 08:49 AM
ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా కుళ్లిన చికెన్‌ను నిల్వ ఉంచి భరత్‌నగర్ పరిధిలోని హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
352 కిలోలు స్వాధీనం... ఒకరు అరెస్టు
హైదరాబాద్ సిటీ: ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా కుళ్లిన చికెన్‌ను నిల్వ ఉంచి భరత్‌నగర్ పరిధిలోని హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుమారు 352 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడించారు. హెచ్-ఫాస్ట్ బృందం వెటర్నరీ అధికారి డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్‌నగర్, జింకలవాడ(Bharat Nagar, Jinkalavada) ప్రాంతంలో ఉన్న ’మెసర్స్ ఎస్.పి.ఆర్ చికెన్‘ ప్రాంగణంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. ఈ మాంసాన్ని స్థానిక హోటళ్లు, చికెన్ విక్రేతలకు సరఫరా చేస్తున్నారని, లైసెన్స్ గడువు కూడా ముగిసిందని విచారణలో తేలింది. ఈ కేసులో రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన సూరజ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేసి సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
Read Latest Telangana News and National News