పెరిగిన పసిడి, వెండి ధరలు! ఒక్కసారిగా..
ABN , Publish Date - Mar 28 , 2026 | 10:37 AM
బంగారం, వెండి ధరల్లో నేడు భారీ పెరుగుదల కనిపించింది. పసిడి ధర రూ.2500 మేర ఎగబాకింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో అంచనాలకు అందని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు రోజులుగా ధరల్లో ఓ మోస్తరు మార్పులు కనిపించినప్పటికీ నేడు అనూహ్యంగా భారీ స్థాయిలో ధరలు పెరిగాయి. భారత్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర సగటున రూ.2,500 మేర పెరిగింది. కిలో వెండి ధరలో రూ.5 వేల మేర పెరుగుదల కనిపించింది (Gold, Silver Rates on March 28).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చి 28) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,090కు చేరుకుంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ధర రూ.2,510 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,300ల మేర పెరిగి రూ.1,35,750కు చేరుకుంది. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.5 వేల మేర ఎగబాకింది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ 24 క్యారెట్ల పసిడి ధర 4,492 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఔన్స్ వెండి ధర 69 డాలర్లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు
చెన్నై: ₹1,49,020; ₹1,36,600
ముంబై: ₹1,48,090; ₹1,35,750
న్యూఢిల్లీ: ₹1,48,220; ₹1,35,900
కోల్‌కతా: ₹1,48,090; ₹1,35,750
బెంగళూరు: ₹1,48,090; ₹1,35,750
హైదరాబాద్: ₹1,48,090; ₹1,35,750
విజయవాడ: ₹1,48,090; ₹1,35,750
కేరళ: ₹1,48,090; ₹1,35,750
పుణె: ₹1,48,090; ₹1,35,750
వడోదరా: ₹1,48,120; ₹1,35,800
అహ్మదాబాద్: ₹1,48,120; ₹1,35,800
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,50,000
ముంబై: ₹2,45,000
న్యూఢిల్లీ: ₹2,45,000
కోల్‌కతా: ₹2,45,000
బెంగళూరు: ₹2,45,000
హైదరాబాద్: ₹2,50,000
విజయవాడ: ₹2,50,000
కేరళ: ₹2,50,000
పుణె: ₹2,45,000
వడోదరా: ₹2,45,000
అహ్మదాబాద్: ₹2,45,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి: