ఆదవ్ అర్జున్ ఎవరో తెలీదు
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:33 PM
ఆదవ్ అర్జున్ ఎవరో తనకు తెలీదని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: ఆదవ్ అర్జున్ ఎవరో తనకు తెలీదని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఒకటి, రెండ్రోజుల్లో రాష్ట్రానికి వచ్చే అవకాశముందని, ఆయన రాగానే కూటమిలో సీట్ల సర్థుబాటు చర్చలు కొలిక్కివస్తాయన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఎవరినీ బెదిరించాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ప్రభుత్వ ధనాన్ని దిగమింగిన వారు, అవినీతిపరులు, ఆదాయానికి మించి ఆస్తులు వెనకేసుకున్నవారే ఈడీ,ఐటీ లను చూసి భయపడుతుంటారని, విమర్శించారు.
సినీ నటుడు విజయ్(Vijay) పార్టీ ప్రారంభించక ముందే ఆయనపై ఈడీ, ఐటీ కేసులున్నాయని, అదేవిధంగా పదేళ్ల క్రితమే డీఎంకే నేతలు పలువురిపై అవినీతి కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల ఆధారంగా వీరిని బీజేపీ బెదిరిస్తుందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. టీవీకేతో తమ నేతలెవ్వరూ పొత్తుపై చర్చల్లో పాల్గొనలేదని, అసలు ఆ పార్టీ కో-ఆర్డినేటర్‌గా చెప్పబడుతున్న ఆదవ్ అర్జున్ ఎవరో కూడా తనకు తెలీదన్నారు.
ఎన్డీయే కూటమి తరుఫున త్వరలో కన్నియాకుమారి, కోయంబత్తూర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని, అయితే తేదీ ఇంకా నిర్ణయించలేదన్నారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తదితర ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు అంగీకరించినట్లు తెలిపారు. చివరగా ఆయన తెలుగువారికి తెలుగులోనే ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్
ఫేస్‌బుక్‌లో భార్య ‘సిమెంట్ ఔర్ డ్రమ్’ పోస్టు!
Read Latest Telangana News and National News