Share News

చేవేళ్లలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

ABN , Publish Date - Mar 20 , 2026 | 10:44 AM

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..

చేవేళ్లలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
Rangareddy Earthquake,

చేవెళ్ల, మార్చి 20: రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్ధంతో కూడిన ఈ ప్రకంపనల ధాటికి ప్రజలు ఏం జరుగుతుందో అని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్ధం వినిపించిందని, కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు.


భూ ప్రకంపనల ధాటికి ఇంట్లో వస్తువులు కదలడం, పాత్రలు శబ్ధం చేయడంతో ప్రజలు ఆందోళనతో వీధుల్లోకి వచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇది తక్కువ తీవ్రత కలిగిన సహజసిద్ధమైన భూకంపమా? లేదా సమీపంలోని క్వారీల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అని రెండు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆ కంటి మందుకు అనుమతుల్లేవు

అయ్యో.. రామచంద్రా..!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 20 , 2026 | 12:51 PM