Share News

గ్రామాల్లో గంజాయి మత్తు

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:19 AM

గ్రామాల్లో గంజాయి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గంజాయి మత్తులో యువత చిత్తు అవుతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి కొట్లాటలకు దిగుతున్నారు.

గ్రామాల్లో గంజాయి మత్తు

  • పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇల్లందకుంట(కరీంనగర్): గ్రామాల్లో గంజాయి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గంజాయి మత్తులో యువత చిత్తు అవుతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి కొట్లాటలకు దిగుతున్నారు. గంజాయి రవాణా పల్లెలకు కూడా పాకడంతో యువత మత్తుకు ఆకర్షితులవుతున్నారు. గ్రామ శివారులో, నిర్మానుష్య ప్రాంతాల్లో సిగరేట్‌ లోకి ఎక్కించి యువత గంజాయి పీల్చు తున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ మాత్రమే దొరికే గంజాయి ఇప్పుడు పల్లెల్లో కూడా విరివిరిగా దొరుకుతోంది. దీంతో ఎంతో మంది యువకులు మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును అందకారంలో నెట్టుకుంటున్నారు.


jgl2.jpgఅక్రమార్జునకు అలవాటుపడి కొందరు సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో గంజాయి ఎక్కిస్తుంటే, మరొకొందరు సిగరేట్‌ రూపంలో దీన్ని విక్రయిస్తున్నారు. గంజాయిని సేవించడం సరదగా అలవాటు చేసుకొని దాని మత్తులో కూరుకుపోతున్నారు. గత రెండురోజుల కిత్రం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇల్లందకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు గంజాయి తాగుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కమలాపూర్‌, హుజూరాబాద్‌ మండలాలకు చెందిన ఎనిమిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

వినిపించని కిలకిలలు

అయ్యో.. రామచంద్రా..!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 20 , 2026 | 11:19 AM