పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల
ABN , Publish Date - Mar 20 , 2026 | 10:31 AM
నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మరి దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న భారీగా పతనమైన బంగారం ధర నేడు (మార్చ్ 20) స్వల్పంగా కోలుకుంది. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.650ల మేర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.600ల మేర పెరిగింది. వెండి ధర మాత్రం తిరోగమనంలో కొనసాగుతూ మరో రూ.5 వేల మేర తగ్గింది (Gold, Silver Prices on March 20).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,930కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే ధర రూ.650ల మేర ఎగబాకింది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.600ల మేర పెరిగి రూ.1,38,350కు చేరుకుంది. నగరంలో వెండి ధర మాత్రం దాదాపుగా నిన్నటి స్థాయిలోనే కొనసాగుతోంది. కిలో వెండి ప్రస్తుతం రూ.2,64,900గా ఉంది.
ఇతర ప్రధాన నగరాల వారీగా చూస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,630గా ఉంది. ఢిల్లీలో రూ.1,51,080గా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,50,930గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ బంగారం ధర రూ.1,38,990గా ఢిల్లీలో రూ.1,38,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,38,350గా ఉంది. దేశంలోని పలు నగరాల్లో వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి చెన్నైలో రూ.2,64,900గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..