Share News

డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:09 PM

తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసి ఆ పార్టీ నుండి వైదొలగిన ప్రముఖ నటి రంజనా నాచ్చియార్‌ గురువారం డీఎంకేలో చేరారు.

డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్‌

చెన్నై: తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసి ఆ పార్టీ నుండి వైదొలగిన ప్రముఖ నటి రంజనా నాచ్చియార్‌ గురువారం డీఎంకే(DMK)లో చేరారు. అన్నా అరివాయలంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. రంజనా నాచ్చియార్‌ టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవకురాలిగాను గుర్తింపు పొందారు. 2023లో పోరూరు గెరుగంబాక్కంలో బస్సులో వేలాడుతూ వెళుతున్న విద్యార్థుల చెంపచెళ్లుమనిపించి కిందకు దింపారు. అదే సమయంలో బస్‌ డ్రైవర్‌, కండెక్టర్లను దూషించి అరెస్టయ్యారు.


జైలు నుండి విడుదలైన తర్వాత రంజనా నాచ్చియార్‌ ప్రజలకు బాగా పరిచయమయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఆ పార్టీ కళా సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. విజయ్‌ నాయకత్వంలోని టీవీకేలో చేరారు. ఇటీవల విజయ్‌ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన సందర్భంగా ఆయన పార్టీ నిర్వాహకుల సమావేశంలో చేసిన విమర్శలపై రంజన మండిపడ్డారు.


nani1.2.jpgఎన్నికల ప్రచార సభల్లో మేనమామగా యువతుల పెళ్ళిళ్లలకు సాయం చేస్తానంటూ గొప్పులు చెప్పుకుంటున్న విజయ్‌ తన పిల్లలకు బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యహరించాలని తెలిపారు. వివాహేతర సంబంధం కొనసాగించడం మంచిదనే భావాన్ని పార్టీ శ్రేణులకు కలిగించే రీతిలో విజయ్‌ ప్రసంగిస్తున్నారంటూ ఆరోపించారు. ఆ తర్వాత కొంత కాలం మౌనంగా గడిపారు. గురువారం ఉదయం అన్నా అరివాలయానికి వెళ్ళి స్టాలిన్‌ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పదేళ్లుగా పైసా ఖర్చు లేకుండా 'ఫ్రీ గ్యాస్' వాడుతున్న మహిళ.. సీక్రెట్ ఏంటో తెలుసా?

ఫేస్‌బుక్‌లో భార్య ‘సిమెంట్‌ ఔర్‌ డ్రమ్‌’ పోస్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 20 , 2026 | 12:09 PM