Share News

రికార్డు స్థాయి కనిష్ఠానికి రూపాయి!

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:13 AM

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.15 వద్ద తచ్చాడుతోంది.

రికార్డు స్థాయి కనిష్ఠానికి రూపాయి!
USD INR rate 93

ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం (మార్చ్ 20) ట్రేడింగ్ ఆరంభంలో రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93.15 వద్దకు చేరింది. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం రూపాయి మారకం విలువపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్‌పై నిన్న తీవ్ర ప్రభావం చూపించాయి. గురువారం గ్లోబల్ మార్కెట్స్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో సూచీలు కుప్పకూలాయి. డాలర్‌పై పెట్టుబడులు పెరగడంతో అమెరికన్ కరెన్సీ మరింత బలపడింది. ఫలితంగా రూపాయి సహా అనేక వర్ధమాన దేశాల కరెన్సీలపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.


వ్యవస్థాగత మదుపర్లు కూడా భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో రూపాయి విలువపై ఒత్తిడి మరింత పెరిగింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధానం కూడా ఈ పరిస్థితికి కొంత దోహదపడిందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత పెట్టేందుకు సంకోచిస్తోంది. దీంతో, పెట్టుబడిదారులకు డాలర్ మరింత ఆకర్షణీయంగా మారి వర్ధమాన మార్కెట్స్‌ నుంచి నిధులు తరలి పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..

Updated Date - Mar 20 , 2026 | 12:49 PM