Share News

డీజీపీ రామచంద్రరావ్‌కు ఎదురుదెబ్బ!

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:15 AM

కర్ణాటక డీజీపీ రామచంద్రరావ్‌కు సంబంధించి వైరల్‌ అయిన వీడియోలు వాస్తవమైనవేనని సిట్‌ తేల్చింది. డీజీపీ హోదా కలిగిన రామచంద్రరావ్‌ దీంతో మరోసారి అడ్డంగా ఇరుక్కుపోయారు.

డీజీపీ రామచంద్రరావ్‌కు ఎదురుదెబ్బ!

  • అశ్లీల వీడియోలు వాస్తవమైనవేనని సిట్‌ నివేదిక

బెంగళూరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): కర్ణాటక డీజీపీ రామచంద్రరావ్‌కు సంబంధించి వైరల్‌ అయిన వీడియోలు వాస్తవమైనవేనని సిట్‌ తేల్చింది. డీజీపీ హోదా కలిగిన రామచంద్రరావ్‌ దీంతో మరోసారి అడ్డంగా ఇరుక్కుపోయారు. రెండు నెలల క్రితం పోలీసు శాఖ చాంబర్‌లోనే ఇద్దరు మహిళలతో డీజీపీ అశ్లీలంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సీఎం సిద్దరామయ్య ఈ విషయా న్ని సీరియ్‌సగా తీసుకున్నారు. వెంటనే రామచంద్రరావ్‌ను సస్పెండ్‌ చేస్తూ సమగ్ర దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఏడీజీపీ హితేంద్ర నేతృత్వంలో ఏర్పడిన సిట్‌లో ఐపీఎస్‌ అధికారులు చేతన్‌సింగ్‌ రాథోడ్‌, రిష్యంత్‌ సిబి, కళా కృష్ణస్వామి ఉన్నారు. వీడియోలు వైరల్‌ అయిన తర్వాత అవి తనకు సంబంధించినవి కావనీ, డీప్‌ఫేక్‌, ఏఐ ఆధారితంగా రూపొందించినవంటూ రామచంద్రరావ్‌ ఆరోపించారు. దీంతో సిట్‌ సీరియ్‌సగా పరిగణించి దర్యాప్తు సాగించింది. వైరల్‌ అయిన వీడియోలు ఏఐ ఆధారితంగానో, డీప్‌ఫేక్‌ ద్వారానో రూపొందినవి కావనీ, అన్నీ వాస్తవమైనవే అంటూ నివేదికలో తేల్చింది. ఈ మేరకు సుమారు 100 పేజీలతో రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం నివేదిక సమర్పించింది.

Updated Date - Mar 20 , 2026 | 05:15 AM