Share News

కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:41 AM

కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని సూరంపేట, గంగారాంతండా అటవీ శివారులో రెండు ఆవులపై పెద్దపులి దాడిచేసి చంపగా ఆవుల కళేబరాలను గురువారం కొడిమ్యాల డీఎఫ్‌ఆర్వో ముషీర్‌ అహ్మద్‌, బీట్‌అధికారులు దహనం చేశారు.

కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం

  • ఆందోళన చెందుతున్న గ్రామస్థులు

  • ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ అధికారులు

కొడిమ్యాల(కరీంనగర్): కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని సూరంపేట, గంగారాంతండా అటవీ శివారులో రెండు ఆవులపై పెద్దపులి దాడిచేసి చంపగా ఆవుల కళేబరాలను గురువారం కొడిమ్యాల డీఎఫ్‌ఆర్వో ముషీర్‌ అహ్మద్‌, బీట్‌అధికారులు దహనం చేశారు. పెద్దపులి వదిలివేయగా కుళ్లిన మాంసాన్ని గ్రామంలోని కుక్కలు, ఇతర జంతువులు ఏవైనా తిని గ్రామాల్లోకి వస్తే ప్రజలు అనారోగ్యం పాలవుతారని అటవీ అధికారులు ఆవుల కళేబరాలను దహనం చేసినట్లు తెలిసింది.


tiger1.jpgరెండురోజులుగా పశువుల పాకలోని ఆవులను పెద్దపులి చంపడంతో అటవీఅధికారులు సంఘటన స్థలాల్లో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి దాడిచేసి చంపిన ఆవును మూడు రోజులుగా అదే ప్రదేశానికి వచ్చి తినటంతో గంగారాంతండా గ్రామశివారులో పెద్దపులి సంచారంపై పరిస్థితిని ఎప్పటికప్పుడు అటవీ అధికారులు సమీక్షిస్తున్నారు. మండలంలోని అటవీ గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వినిపించని కిలకిలలు

అయ్యో.. రామచంద్రా..!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 20 , 2026 | 11:41 AM