స్టాలిన్ దర్శనం కోసం రూ.1.25 లక్షలు !
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:45 PM
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అరివాలయంలో డీఎంకే ఆశావహుల వద్ద ఉత్సాహభరితంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి.
మొడకురిచ్చి నుంచి వచ్చిన ఐదుగురు అభిమానులు
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అరివాలయంలో డీఎంకే ఆశావహుల వద్ద ఉత్సాహభరితంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన ఇంటర్వ్యూలలో డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్రముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను దగ్గరగా చూడాలనే సంకల్పంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తులను కొని అరివాలయానికి వచ్చిన ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇందుకోసం ఆ ఐదుగురు రూ.1.25 లక్షలు ఖర్చు చేయడం విశేషం.
మార్చి 17 నుండి డీఎంకే ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆశావహులకు ఇంటర్వ్యూలు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం కరూర్, నామక్కల్, ఈరోడ్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరిగాయి. మొడకురిచ్చి నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఇంటర్వ్యూలో 31 మంది పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మోహనసుందరం, ఆయన కుటుంబీకులు పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ ముగించుకుని అరివాలయం వెలుపలకు వచ్చిన మోహనసుందరం మీడియాతో మాట్లాడుతూ.. స్టాలిన్‌ను దగ్గరి నుంచి చూసి, మాట్లాడాలన్న కోరికతో తాము ఇలా ఇంటర్వ్యూకు హాజరయ్యామని చెప్పారు. తమది పేదరిక కుటుంబమైనప్పటికీ స్టాలిన్‌పై వున్న అభిమానంతో ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుతో దరఖాస్తు కొనుగోలు చేశామని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పెళ్లాడింది జీవిత భాగస్వామిని.. పనిమనిషిని కాదు...
అమలులోకి నేషనల్ డెంటల్ కమిషన్
Read Latest Telangana News and National News