అమలులోకి నేషనల్ డెంటల్ కమిషన్
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:54 AM
దేశంలో దంత వైద్య విద్య ప్రక్షాళన దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల కాలం నాటి ‘డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా...
న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలో దంత వైద్య విద్య ప్రక్షాళన దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల కాలం నాటి ‘డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (డీసీఐ) స్థానంలో నేషనల్ డెంటల్ కమిషన్ (ఎన్‌డీసీ)ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 19 నుంచే ఈ కొత్త కమిషన్ అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. డాక్టర్ సంజయ్ తివారీ ఈ కమిషన్ మొదటి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇకపై దేశవ్యాప్తంగా దంత వైద్య విద్య, వృత్తిపరమైన ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలన్నీ ఈ కొత్త కమిషన్ పరిధిలోకి వస్తాయి. ఈ నూతన వ్యవస్థలో భాగంగా పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వం మూడు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసింది.