మాట నిలుపుకున్న సర్కారు
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:53 AM
నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌క్యాలండర్ విడుదల చేసి మాట నిలుపుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కందికుంట
కదిరి(అనంతపురం): నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌క్యాలండర్ విడుదల చేసి మాట నిలుపుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్(MLA Kandikunta Venkata Prasad) పేర్కొన్నారు. స్థానిక తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుద చేస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చామన్నారు. ఆ మేరకు ఉగాది రోజున ప్రభుత్వం జాబ్‌క్యాలెండర్ విడుదల చేసిందన్నారు.
కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమనీ, చేతులూపేది కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయగా.. అందులో ఆనేక అవకతవకలకు పాల్పడ్డారన్నారు. ఎంపికైన అధికారులందరినీ ప్రాధాన్యతలేని పోస్టుల్లో ఉంచాలని ఆదేశించిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం పకడ్బందీగా ఉద్యోగ నియామకాలు చేపడుతోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
Read Latest Telangana News and National News