ఒడిశా సరిహద్దులో బస్సు దగ్ధం.. 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:04 AM
విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
విజయనగరం, మార్చి 21: విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఒడిశాకు చెందిన రన్నింగ్ బస్సు టైర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. అయితే, డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఒడిశా నుంచి వస్తున్న ఈ ప్రైవేట్ బస్సు రామభద్రపురం సమీపానికి చేరుకోగానే, ఒక్కసారిగా బస్సు టైర్ పేలిపోయింది. దాంతో టైర్ వద్ద మంటలు చెలరేగి, క్షణాల్లోనే అవి బస్సు మొత్తానికి వ్యాపించాయి. మంటలు గమనించి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వెంటనే బస్సును పక్కకు నిలిపివేశారు. ప్రయాణికులకు త్వరగా కిందకు దిగిపోవాలని హెచ్చరించడంతో, బస్సులో ఉన్న 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా కిందకు దిగిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నప్పటికీ, బస్సులోని వారి సామాగ్రి, ఇతర వస్తువులు మంటల్లో కాలిపోయాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం