తిరోగమనంలో పసిడి ధరలు!
ABN , Publish Date - Mar 21 , 2026 | 06:43 AM
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితులు, బలపడుతున్న డాలర్ కారణంగా లోహాల ధరలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితులు, బలపడుతున్న డాలర్ వెరసి బంగారానికి డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయి. వెండి కూడా ఇదే బాటలో కొనసాగుతోంది (Gold, Silver Rates on March 21). రికార్డు స్థాయిలో ధరలు తగ్గుతున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చ్ 21) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900కు తగ్గింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,540కు చేరింది. కిలో వెండి రూ.2,59,900 వద్ద కొనసాగుతోంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కనిష్ఠానికి చేరుకోవడం కూడా దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. పసిడి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ ఇందుకోసం డాలర్లలో చెల్లింపులు జరుపుతుంది. దీంతో, డాలర్ బలపడే కొద్దీ బంగారం ధర పెరిగి డిమాండ్ తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు.
ఇక పసిడిపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని కూడా మార్కెట్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు. డాలర్ స్థితిగతులు, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పసిడి (24కే, 22కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,52,190; ₹1,39,510;
ముంబై: ₹1,48,900; ₹1,36,540;
న్యూఢిల్లీ: ₹1,49,050; ₹1,36,690;
కోల్‌కతా: ₹1,48,900; ₹1,36,540;
బెంగళూరు: ₹1,48,900; ₹1,36,540;
హైదరాబాద్: ₹1,48,900; ₹1,36,540;
విజయవాడ: ₹1,48,900; ₹1,36,540;
కేరళ: ₹1,48,900; ₹1,36,540;
పుణే: ₹1,48,900; ₹1,36,540;
వడోదరా: ₹1,48,950; ₹1,36,590;
అహ్మదాబాద్: ₹1,48,950; ₹1,36,590;
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹2,59,900;
ముంబై: ₹2,54,900;
న్యూఢిల్లీ: ₹2,54,900;
కోల్‌కతా: ₹2,54,900;
బెంగళూరు: ₹2,54,900;
హైదరాబాద్: ₹2,59,900;
విజయవాడ: ₹2,59,900;
కేరళ: ₹2,59,900;
పుణే: ₹2,54,900;
వడోదరా: ₹2,54,900;
అహ్మదాబాద్: ₹2,54,900;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం
మార్కెట్లోకి సెమాగ్లుటైడ్ ఔషధాల వెల్లువ