Share News

‘ఉన్నత విద్య’లోకి సాంకేతిక విద్యా శాఖ

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:25 AM

రాష్ట్ర ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ సబ్జెక్టులు, ఆస్తులు, సిబ్బందిని ఉన్నత విద్యాశాఖకు బదలాయించేందుకు...

‘ఉన్నత విద్య’లోకి సాంకేతిక విద్యా శాఖ

  • సాంకేతిక విద్యా కమిషనర్‌ పోస్టు రద్దు

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ సబ్జెక్టులు, ఆస్తులు, సిబ్బందిని ఉన్నత విద్యాశాఖకు బదలాయించేందుకు అనుమతిస్తూ సాధారణ పరిపాలనశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కళాశాల విద్యా కమిషనరేట్‌ను ఉన్నత విద్య కమిషనరేట్‌గా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు కొత్త కమిషనరేట్‌ ఏర్పాటు చేసింది. సాంకేతిక విద్యాశాఖను రద్దుచేసింది. ఇప్పటివరకూ సాంకేతిక విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి పరిధిలో ఉండగా.. దానిని ఉన్నత విద్యలోకి మార్చింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఆ శాఖ సబ్జెక్టులు, ఆస్తులు, సిబ్బందిని మార్చేందుకు అనుమతిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు మరి కొన్ని నిబంధనలను సవరించింది. సాంకేతిక విద్యాశాఖ సర్వీస్‌ రూల్స్‌ను కళాశాల విద్యాశాఖ సర్వీస్‌ రూల్స్‌లో చేర్చింది. సాంకేతిక విద్యాశాఖలోని స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను అటానమస్‌ ఆర్గనైజేషన్స్‌లో చేర్చింది. యూనివర్సిటీ విద్యలో బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ తర్వాత పాలిటెక్నిక్స్‌ను చేర్చింది.

Updated Date - Mar 21 , 2026 | 05:25 AM