లోకేశ్‌ను విమర్శిస్తే సహించం
ABN , Publish Date - Mar 21 , 2026 | 10:54 AM
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై టీడీపీ అర్బన్ నాయకులు మండిపడ్డారు.
తాటిపర్తిపై తెలుగు తమ్ముళ్ల ఫైర్
అనంతపురం: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై టీడీపీ అర్బన్ నాయకులు మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తాటిపర్తి దిష్టిబొమ్మను శుక్రవారం రాత్రి క్లాక్ టవర్ వద్ద దహనం చేశారు. వైసీపీ(YCP) ఐదేళ్ల పాలనలో జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, నిరుద్యోగులను మోసం చేశారని టీడీపీ నగర అధ్యక్షులు సుధాకర్ యాదవ్ మండిపడ్డారు.
మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని అన్నారు. తాజాగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని అన్నారు. ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, ఇలాగే మాట్లాడితే అవి కూడా లాగేస్తారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఫిరోజ్ అహ్మద్, సాకే లక్ష్మీనరసింహ, రాజారావు, బొమ్మినేని శివ, సరిపూటి శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
Read Latest Telangana News and National News