గ్యాస్ కోసం జనం బారులు
ABN , Publish Date - Mar 21 , 2026 | 10:16 AM
వంట గ్యాస్ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. రానున్న రోజుల్లో సిలిండర్లు దొరకడం కష్టమంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో జనం గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.
హైదరాబాద్: వంట గ్యాస్ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. రానున్న రోజుల్లో సిలిండర్లు దొరకడం కష్టమంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో జనం గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. శుక్రవారం బోయినపల్లి(Boyinapalli) కేంద్రంలోని గ్యాస్ గోడౌన్ వద్ద వందలాది మంది వినియోగదారులు సిలిండర్ల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు.
గ్యాస్ బుక్ చేసినా నివాసాల వద్దకు గ్యాస్ సిలిండర్లు రాకపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన పెరిగిపోయింది. దీంతో సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. శనివారం రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లింలు ఎక్కువగా గ్యాస్ గోదాం వద్ద క్యూకట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
Read Latest Telangana News and National News