ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం తీరని లోటు.. మంత్రి నారా లోకేశ్ సంతాపం
ABN , Publish Date - Mar 21 , 2026 | 09:26 AM
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటు అని పేర్కొన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. నిబద్ధతతో, క్రమశిక్షణతో ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటు. ఆ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
ఉన్నం హనుమంతరాయ చౌదరి కొంతకాలంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మార్క్ ఫెడ్ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. 2014-2019 మధ్య కల్యాణ దుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంత కాలం ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. అలాగే, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా పదేళ్ల పాటు పనిచేశారు. సర్పంచ్ స్థాయి నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన ఎమ్మెల్యేగా ఎదిగారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణకే ఐఏఎస్ వాణిప్రసాద్: డీవోపీటీ ఉత్తర్వులు