సుప్రియకు అండగా దాతలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 06:12 AM
అరుదైన వ్యాధితో బాధపడుతూ పదేళ్లుగా మంచానికే పరిమితమైన ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం గురజకు చెందిన భైరవపట్నపు ఏసుబాబు, రాజేశ్వరీదేవి దంపతుల కుమ ర్తెసుప్రియను...
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి విశేష స్పందన
ముదినేపల్లి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): అరుదైన వ్యాధితో బాధపడుతూ పదేళ్లుగా మంచానికే పరిమితమైన ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం గురజకు చెందిన భైరవపట్నపు ఏసుబాబు, రాజేశ్వరీదేవి దంపతుల కుమర్తె సుప్రియను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. ఆ బాలిక పదేళ్ల వయస్సులోనూ వెన్నెముక, స్పర్శ తగ్గిన కాళ్ళతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిపై ‘కుంగదీస్తున్న వెన్నెముక’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు దాతలు ఫోన్ ద్వారా సుప్రియ ఆరోగ్య పరిస్థితిని బాలిక తల్లిదండ్రులను అడిగి తెలుసుకుని తమ ఆర్థిక సాయాన్ని ఫోన్ పే, బ్యాంకు ఖాతాకు పంపారు. మరి కొందరు దాతలు వైద్య సహాయానికి ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.