Share News

టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

ABN , Publish Date - Mar 21 , 2026 | 10:10 AM

ఉరవకొండ మండలం రేణుమాకులపల్లెలో వైసీపీ సైకో మూకలు వీరంగం సృష్టించాయి. టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగపడ్డాయి. టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి మహిళలు, చిన్నారులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.

టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ మూకలు..
YSRCP vs TDP

అనంతపురం: ఉరవకొండ మండలం రేణుమాకులపల్లెలో వైసీపీ సైకో మూకలు వీరంగం సృష్టించాయి. టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగపడ్డాయి. టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి మహిళలు, చిన్నారులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఉగాది పండుగ సమయంలో(శుక్రవారం రాత్రి) ఆనందంగా ఉన్న టీడీపీ కార్యకర్తల కుటుంబాలపై వైసీపీ సర్పంచ్ రామాంజనేయులు, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు.


మహిళలు, చిన్నారులని చూడకుండా రెచ్చిపోయారు. ఇష్టమెుచ్చినట్లు కొట్టి తీవ్రంగా గాయపరిచారు. వైసీపీ కార్యకర్తల దాడులకు అడ్డుపడిన స్థానిక మహిళలనూ చితకబాది కార్లు, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు. వారి దాడిలో పలువురు మహిళలు, చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి రేణుమాకులపల్లెలో పోలీసుల పికెటింగ్ కొనసాగుతోంది. దాడికి తెగపడిన సర్పంచ్ రామాంజనేయులుతోపాటు కొంతమంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ మూకల వీరంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని చూడకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం తీరని లోటు.. మంత్రి నారా లోకేశ్ సంతాపం

Updated Date - Mar 21 , 2026 | 10:20 AM