Share News

వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:50 PM

ప్రముఖ నేపథ్యగాయని, బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాగూర్‌ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..

  • రాష్ట్రానికి రానున్న బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే

చెన్నై: ప్రముఖ నేపథ్యగాయని, బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాగూర్‌ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రముఖ నేపథ్యగాయని మైథిలి ఠాగూర్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అలాగే, అజిత్‌ ‘విశ్వాసం’ చిత్రంలో ‘కన్నాన్‌ కన్నేన్‌....’పాటను మైథిలి పాడుతూ విడుదల చేసిన వీడియో రాష్ట్ర ప్రజల ఆదరణ పొందింది.


nani3.2.jpgఇటీవల కేరళ, పుదుచ్చేరి ఆరోవిల్‌లో జరిగిన కార్యక్రమాల్లో మైథిలి తమిళ భక్తి పాటలు పాడారు. ఈ క్రమంలో, ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మైథిలిని రాష్ట్రంలోనూ ప్రచారం చేయించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అందుకోసం తమిళంలో మురుగన్‌ పాటలు నేర్చుకుని, ఆమె తన ప్రచారంలో ఆ పాట లు పాడించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!

బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2026 | 12:53 PM