Share News

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:21 AM

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పోలీస్ సంఘం ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు
Perni Nani

కృష్ణా, ఏప్రిల్ 3: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నిన్న(గురువారం) మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటన నేపథ్యంలో పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిలకలపూడి సీఐ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేస్తూ అవమానించారు. అంతేకాకుండా పోలీసులకు బెదిరించారు మాజీ మంత్రి. పోలీసుల పట్ల మాజీ మంత్రి వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


నిన్న మచిలీపట్నం కొబ్బరితోటలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన పేర్ని నాని పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవ్వరినీ వదలమని, తమ ప్రభుత్వం వచ్చాక అంతు చూస్తామంటూ పోలీసులను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

లేఆఫ్స్ వేళ ఊహించని షాక్.. ఒరాకిల్‌ను టార్గెట్ చేసిన ఇరాన్..

ఒకే మాట.. ‘రాజధాని అమరావతి’

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 10:25 AM