ఇక పల్లె పోరు..రేపే నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:11 PM
పల్లె పోరుకు వేళైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
అనంతపురం: పల్లె పోరుకు వేళైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 576 పంచాయతీల్లో మూడు విడతల్లో సర్పంచు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కూటమి జయకేతనం ఎగరవేసి జోష్‌లో ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరగకపోయినప్పటికీ పంచాయతీల్లో పట్టుకున్న నాయకున్ని దింపేందుకు కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు.
పట్టణ, పరిషత్ ఎన్నికల్లో బోల్తా పడినా.. కనీసం గ్రామ పంచాయతీల్లోనైన పరువు కాపాడుకొనే దిశగా వైసీపీ యంత్రాంగం ప్యూహాలకు పదును పెట్టింది. కాగా పంచాయతీల్లో కొంత రాజకీయంగా బలం ఉన్న నాయకుడు రిజర్వేషన్లు తారుమారు కావడంతో తమ అనుయాయులను రంగంలోకి దింపి నెగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్
ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News