Share News

జనసేన నేతల పేర్లతో ఏడు కోట్ల రూపాయల మోసం..!

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:36 AM

గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ఆఫీస్ పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఏలూరు, తణుకు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

జనసేన నేతల పేర్లతో ఏడు కోట్ల రూపాయల మోసం..!
Mangalagiri Police

గుంటూరు జిల్లా, నవంబర్ 12: మంగళగిరి జనసేన ఆఫీస్ పేరుతో ఏడు కోట్ల రూపాయల మోసం జరిగిందనే వ్యవహారం కలకలం రేపుతోంది. ఏలూరు, తణుకు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపుగా 20 మంది వద్ద నుంచి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జనసేన నేతలు పోలీసులను ఆశ్రయించారు. ధరణి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా జనసేన నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్ (KK), కోట రుక్మిణి పేర్లతో ఉపయోగించి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఈ మోసాన్ని గుర్తించిన వెంటనే జనసేన నేతలు కేకే, కోటా రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కార్యాలయాన్ని, పార్టీ గుర్తును దుర్వినియోగం చేస్తూ.. తమ పేర్లతో అక్రమంగా వసూళ్లకు పాల్పడిన వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి వద్ద ఎంత వసూలు చేశారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ధరణి కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 11:10 AM