Share News

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Nov 12 , 2026 | 08:41 AM

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా ప్రారంభించలేదని పేర్కొన్నారు. 1979 నుంచే అమెరికాపై ఇరాన్ పోరాటం చేస్తోందని అన్నారు.

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా ప్రారంభించలేదని పేర్కొన్నారు. 1979 నుంచే అమెరికాపై ఇరాన్ పోరాటం చేస్తోందని అన్నారు. ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటికే గెలిచిందని, అయితే పాక్షిక విజయం కాకుండా సంపూర్ణ విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికా ధ్వంసం చేసిన వాటిని తిరిగి నిర్మించుకోవడానికి ఇరాన్‌కు 25 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు (Donald Trump about Iran War).


అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికలో బుధవారం నిర్వహించిన 2026 జాతీయ సైనికుల దినోత్సవ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇరాన్‌తో యుద్ధంపై తన వైఖరిని వెల్లడించారు. అమెరికా ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రారంభించలేదని, 1979 నుంచే అమెరికాపై ఇరాన్ యుద్ధం చేస్తోందని అన్నారు. ఈ సమస్యను చాలా కాలం క్రితమే పరిష్కరించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్‌పై గట్టిగా స్పందించామని, అమెరికా సైన్యం తీవ్రంగా పోరాడిందని చెప్పారు. ఈ పోరాటంలో అమెరికా విజయం సాధించిందని పేర్కొన్నారు (Trump Total Victory).


ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యాలపై బీ-2 బాంబర్లతో దాడులు నిర్వహించామని, వాటిని ధ్వంసం చేశామని చెప్పారు (America Iran War). ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. ఇరాన్‌పై ఇప్పటికే 93 శాతం విజయం సాధించామని, అయితే తమకు 100 శాతం విజయం కావాలని అన్నారు. ఇకపై ఆ దేశంలో మరింత విధ్వంసం సృష్టించాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్‌తో కొనసాగుతున్న పోరాటంలో అమెరికా కూడా ప్రాణనష్టాన్ని చవిచూసిందని ట్రంప్ అంగీకరించారు. ఈ యుద్ధంలో 18 మంది అమెరికన్లను కోల్పోయామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

Updated Date - Nov 12 , 2026 | 08:41 AM