ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..
ABN , Publish Date - Nov 12 , 2026 | 07:25 AM
చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అంగీకరించిన ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు మరో మహిళతో కూడా అఫైర్ ఉన్నట్టు తాజాగా బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అంగీకరించిన ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు మరో మహిళతో కూడా అఫైర్ ఉన్నట్టు తాజాగా బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కృత్రిమ మేధ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎన్విడియాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఈవో జెన్సెన్ హువాంగ్ను పదవి నుంచి తొలగించేందుకు బోర్డు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి (Nvidia Jensen Huang).
సీఈవో జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు సంస్థ డైరెక్టర్ల బోర్డు సమావేశం కావడానికి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా పేర్కొంది. ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగానికి చెందిన ఉపాధ్యక్షురాలు కింబర్లీ పావెల్తోనూ జెన్సెన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందని వెల్లడించింది. సంస్థలో పనిచేసిన ఐదుగురు వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు, ఒక కార్యక్రమంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలను పరిశీలించినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ ఆరోపణలు సంస్థలో ఆయన నాయకత్వంపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తాయి (Nvidia Spy Affair).
కాగా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జెన్సెన్ హువాంగ్ సంస్థ ఉద్యోగులకు ఒక సందేశం పంపారు (China Spy Allegations). అలాగే తన భార్యకు నమ్మకద్రోహం చేసిన విషయాన్ని అంగీకరిస్తూ, తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఆయన వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా సంస్థ ప్రతిష్ఠ, పాలనాపరమైన బాధ్యతలు, జాతీయ భద్రత వంటి అంశాలతో ముడిపడటంతో వివాదం మరింత తీవ్రమైంది. రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్
ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ