నోరూరించే పంజాబీ కాతీ రోల్.. తయారీ ఇంత సులభమా..
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:51 AM
పంజాబీ కాతీ రోల్‌ను ఒక్కసారి రుచిచూస్తే.. దానికి అభిమానులవడం ఖాయం. స్పైసీ పంజాబీ ఫ్లేవర్స్‌తో తయారైన దీన్ని ఎవరు తిన్నా.. వారెవ్వా అనాల్సిందే.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబీ కాతీ రోల్‌ను ఒక్కసారి రుచిచూస్తే.. దానికి అభిమానులవడం ఖాయం. స్పైసీ పంజాబీ ఫ్లేవర్స్‌తో తయారైన దీన్ని ఎవరు తిన్నా.. వారెవ్వా అనాల్సిందే. పిల్లల నుంచీ పెద్దల వరకు అందరూ ఈ కాతీ రోల్ రుచికి దాసోహం అవ్వాల్సిందే. పైగా దీన్ని చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. నిమిషాల్లో ఈ వంటకాన్ని వండి మనసారా ఆరగించవచ్చు. ఇంతకీ పంజాబీ కాతీ రోల్ ఎలా చేయాలో తెలుసా..?
కావాల్సినవి ఇవి..
పంజాబీ కాతీ రోల్ తయారీ కోసం ఈ కింది పదార్థాలు అవసరం.
100 గ్రాముల చికెన్
150 గ్రాముల ఎగ్ బుర్జీ
తరిగించిన ఉల్లిపాయలు
అల్లం, వెల్లుల్లి
టొమాటో ప్యూరీ
పెరుగు
మెంతి
కారం పొడి
గరం మసాలా
చాట్ మసాలా
ఆలివ్ నూనె
2-4 చపాతీలు
చేయాల్సింది ఇలా..
చికెన్‌ను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి
నాన్-స్టిక్ పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి
తరువాత తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి
ఆపై చికెన్ ముక్కలు వేసి ఉడికించాలి.
చికెన్ ఉడికిన అనంతరం పెరుగు, మసాలాలు మిశ్రమానికి కలపాలి
ఈ పదార్థాన్ని చపాతీపై సమానంగా పరిస్తే చాలు.. పంజాబీ కాతీ రోల్ రెడీ.
ఇవీ చదవండి
ఆలూ, బీట్‌రూట్‌తో రుచికరమైన హల్వా.. తయారీ విధానం ఇదిగో!