Share News

ఆలూ, బీట్‌రూట్‌తో రుచికరమైన హల్వా.. తయారీ విధానం ఇదిగో!

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:32 PM

ఆలూ, బీట్‌రూట్‌ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆలూ - ఒకటి (పొట్టుతీసి, తురిమినది), బీట్‌రూట్‌ - 3 (పొట్టుతీసి, తురుముకోవాలి), చక్కెర - అర కప్పు.

ఆలూ, బీట్‌రూట్‌తో రుచికరమైన హల్వా.. తయారీ విధానం ఇదిగో!
Vantalu

కావాల్సిన పదార్థాలు: ఆలూ - ఒకటి (పొట్టుతీసి, తురిమినది), బీట్‌రూట్‌ - 3 (పొట్టుతీసి, తురుముకోవాలి), చక్కెర - అర కప్పు, కోవా - పావు కిలో, పాలు - ముప్పావు కప్పు, నెయ్యి - మూడు స్పూన్లు, యాలకుల పొడి - అర స్పూను, డ్రైఫ్రూట్స్‌ ముక్కలు - మూడు స్పూన్లు.


book-4.jpgతయారుచేసే విధానం: మందపాటి బాణలిలో నెయ్యి వేసి ఆలూ, బీట్‌రూట్‌ తురుమును మూడు నిమిషాలు వేయించాలి. చక్కెర చేర్చి మరో మూడు నిమిషాలు వేయించాలి. ఆ తరవాత కోవా కలిపి మరో రెండు నిమిషాలు వేయించాలి. పాలు, యాలకుల పొడి వేసి అయిదు నిమిషాలు ఉడికిస్తే ఆలూ, బీట్‌రూట్‌ హల్వా తయారు. పైన డ్రైఫ్రూట్స్‌ పలుకులు చల్లడం మరచిపోకండి.


ఈ వార్తలు కూడా చదవండి:

మెంతులు, మెంతికూరతో ఎన్నో ప్రయోజనాలు.. ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే?

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 01:32 PM