Share News

మెంతులు, మెంతికూరతో ఎన్నో ప్రయోజనాలు.. ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే?

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:19 PM

మెంతి ఆకుల్ని కూరల్లోనూ, మెంతుల్ని మసాలా దినుసుల్లోనూ వాడుతుంటాం. తెలుగువారికి పచ్చడి అంటే తాలింపులో మెంతులు ఉండాల్సిందే!

మెంతులు, మెంతికూరతో ఎన్నో ప్రయోజనాలు.. ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే?
Vantalu

మెంతి ఆకుల్ని కూరల్లోనూ, మెంతుల్ని మసాలా దినుసుల్లోనూ వాడుతుంటాం. తెలుగువారికి పచ్చడి అంటే తాలింపులో మెంతులు ఉండాల్సిందే! మెంతులు, మెంతి కూరల్లో కమ్మని వాసన, కొద్దిగా చేదు వాటికి గట్టి పొగడిక నిచ్చాయి.

తీపి, పులుపు, ఉప్పు, కారం వగరు చేదు ఉంటేనే అది తూకానికి (బ్యాలెన్స్‌ డైట్‌) నిలుస్తుంది. మెంతులు, మెంతాకులు వగరుగా చేదుగా ఉంటాయి. అందుకని వీటిని కొద్దిగా నైనా రోజూ తింటూ ఉండటం వలన ఒంటికి సత్తువ పెరుగుతుంది. బిట్టర్‌ టానిక్‌ అనేది మెంతులకు, మెంతాకులకు పొసగే మాట!


రోటిపచ్చళ్లలో మెంతుల్ని తాలింపుల్లో వేయించి కలుపుతారు. ఊరుగాయల్లో మెంతిపిండిని కలుపుతారు. ఆవకాయలో కూడా మెంతుల్ని కలపటం, ఆవపిండికి బదులుగా మెంతిపిండితో మెంతికాయ పెట్టుకోవటం తెలుగువారికి ఇష్టమైనవి! ‘మెంతిబద్ద’ అనే పిలుపు కూడా ఉంది.

100 గ్రాముల మెంతికూరలో 3.5 గ్రాములు ఆహార పీచుతో పాటు క్యాల్షియం, ‘ఏ’

విటమిన్‌, ఇనుము ఉన్నాయి. ఇవి మెంతికూరని తరచూ తినేవారికి సరిపడగా ఉంటాయి. పీచుపదార్థాలే పేగులకు సత్తువ నిస్తాయి. దానివలన ఆకలి మెండుగా ఉంటుంది. ఇవి రక్తంలోకి చక్కెరలు, కొవ్వు వెళ్ళటాన్ని జాప్యం చేస్తాయి.


మెంతాకుల కూర: మెంతికూరని వెల్లుల్లి,

పసుపుతో కలిపి తక్కువ నూనెతో కూరగా వండుకుని తింటూ ఉంటే ఊబకాయం తగ్గుతుంది. వారానికి రెండుమూడుసార్లయినా మెంతాకుల పప్పు, పులుసు లేదా, పచ్చడి మంచివి.

మెంతివరుగుల పప్పు, పచ్చడి: ఎండించిన మెంతి ఆకుల్ని మెంతి వరుగులు అంటారు. ఈ వరుగుల్ని కొద్దిసేపు నీళ్లలో నానబెట్టి పప్పు, పచ్చడి పులుసు వండుకోవచ్చు.


book8.2.jpgమెంతివరుగులతో చారు: ఎండించిన మెంతాకుల్ని మిక్సీ పట్టి, చారుపొడి కలిపి కాచిన చారు (రసం) కమ్మగా ఉంటుంది. మెంతికూర దొరకని రోజుల్లో కూడా వాడుకోదగినదిగా ఉంటుంది. మెంతి వరుగుల పొడిని మజ్జిగ (చల్ల)లో కలిపి తాలింపు పెట్టినదాన్ని మెంతిచారు అంటారు. ఇది అమీబియాసిస్‌ లాంటి పేగుల వ్యాధుల్లో పనిచేస్తుంది.

మెంతాకుల కారప్పొడి: ఎండించిన మెంతాకుల్ని పైపైన వేగించి మెత్తగా

దంచాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ/వెల్లుల్లి, నువ్వులు, మిరపకాయలు, చింతపండు వీటిని తగుపాళ్లలో తీసుకుని విడివిడిగా వేయించి తగినంత ఉప్పు కలిపి వీటిని కూడా దంచాలి. ఈ రెండింటినీ చెరిసగంగా కలిపినది మెంతాకుల కారప్పొడి. దీన్ని అన్నంలో మొదటి ముద్దగా తింటూ ఉంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువలన అన్నం తగ్గించి తినటానికి వీలవుతుంది. షుగరు ఉన్నవారికి, ఊబకాయం ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వాతరోగాలు తగ్గుతాయి. అజీర్తి పోతుంది.


మెంతికూర పచ్చడి: నవనవలాడే మెంతా కుల్ని, పులుపు కోసం తగినంత గోంగూర గానీ చింత చిగురుగానీ తీసుకుని దోరగా వేగించి సంబారాలు కలిపి తయారుచేసిన పచ్చడి కొద్ది రోజులు నిలవ వుంటుంది. అన్నంలో తరచూ తింటూ ఉంటే రక్తహీనత తగ్గుతుంది.

ఉత్తరాది వంటకాలు: మెంతికూరతో మేథీచ మన్‌ లాంటి కర్రీలు, మేథీ పరాటాలు, మేథీ పకోడీలు, మేథీ పూరీలు ఉత్తరాదిలో ఎక్కువగా తింటూ ఉంటారు. మనకన్నా తీపి వంటకాలు తినటం అక్కడ ఎక్కువ. అందువలన కలిగే ఇబ్బందిని తగ్గించటానికి మేథీ వాడకం కూడా అక్కడ ఎక్కువ. మెంతాకులు, మెంతులు సర్వ శక్తిమంతులు! దొరికితే వదలకండి!

  • డా. జి.వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

భ్రాంతిలో బతికితే ఫలితమిదే!

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 12:19 PM