Share News

హైదరాబాద్‌లో సైబర్ మోసం.. గంటలోనే రూ.7.9 కోట్లు మాయం

ABN , Publish Date - Nov 08 , 2026 | 09:16 AM

హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కీర్తనా ఫిన్‌సర్వ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాను కేటుగాళ్లు కొల్లగొట్టారు.

హైదరాబాద్‌లో సైబర్ మోసం.. గంటలోనే రూ.7.9 కోట్లు మాయం
Cyber Attack

హైదరాబాద్: నగరంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) కీర్తనా ఫిన్‌సర్వ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాను కేటుగాళ్లు కొల్లగొట్టారు. కేవలం గంట వ్యవధిలోనే సుమారు రూ.7.9 కోట్లను స్వాహా చేశారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులోని ఆ సంస్థ కార్పొరేట్ ఖాతాను లక్ష్యంగా చేసుకున్న నేరగాళ్లు.. మొత్తం 39 అనధికార లావాదేవీల ద్వారా నగదును దోచుకున్నారు.


నవంబర్ 6న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు సంస్థ ప్రతినిధులు గుర్తించారు. కీర్తనా ఫిన్‌సర్వ్ లిమిటెడ్ ప్రతినిధి చాగంటి వరప్రసాద్ (45) ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) పోలీసులు కేసు నమోదు చేశారు. ఖాతా లావాదేవీల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా కీర్తనా ఫిన్‌సర్వ్ లిమిటెడ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఘటనతో సంస్థ యాజమాన్యం, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

దీపావళి.. వెలుగుల వేడుక.. విజయానికి ప్రతీక

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి

Updated Date - Nov 08 , 2026 | 09:18 AM