దీపావళి.. వెలుగుల వేడుక.. విజయానికి ప్రతీక
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:20 AM
దీపాల వెలుగులు మీ జీవితాల్లో నూతన ఆశలను నింపాలి.. లక్ష్మీకటాక్షం మీ కుటుంబాల్లో సిరిసంపదలను కురిపించాలి.. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ ఇంట శాశ్వతంగా నిలవాలని కాంక్షిస్తూ... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి అంటే సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. చీకటిని పారద్రోలి వెలుగులను నింపే ఈ వేడుక ప్రతి ఇంటా ఆనందాన్ని, ఆశలను నింపుతుంది. దీపావళి అంటే దీపాల పండుగ మాత్రమే కాదు.. అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.
శ్రీరాముడు రావణుడ్ని సంహరించాక అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని గాథ, నరకాసుర సంహారంతో ముడిపడిన పురాణగాథలు ఈ పండుగ విశిష్టతను చెబుతాయి. లక్ష్మీదేవి ఆరాధనతో సిరిసంపదలు, సుఖసంతోషాలు కలగాలని ప్రజలు ఆకాంక్షిస్తారు. ఇక.. దీపావళి మనకిచ్చే అసలైన సందేశం.. మనలోని అసూయ, ద్వేషం, అహంకారం అనే చీకట్లను తొలగించి ప్రేమ, దయ, మానవత్వం అనే దీపాలను వెలిగించుకోవడమే.
ఈ దీపావళి ప్రతి ఇంటా వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఇవీ చదవండి: