వెలిగే దీపం... ఇలా భద్రం
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:15 AM
దీపావళి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తుంటాం. ముగ్గుని కూడా దీపాలతో అలంకరిస్తుంటాం. కానీ సాయంత్రంపూట వీచే చల్లటి గాలులకు దీపాలు తరచూ ఆరిపోతూ ఉంటాయి. అలాకాకుండా...
దీపావళి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తుంటాం. ముగ్గుని కూడా దీపాలతో అలంకరిస్తుంటాం. కానీ సాయంత్రంపూట వీచే చల్లటి గాలులకు దీపాలు తరచూ ఆరిపోతూ ఉంటాయి. అలాకాకుండా ఏ చిట్కాలు పాటించవచ్చో చూద్దాం...
ప్రమిదపైన గాజు చిమ్నీని ఉంచితే గాలి వీచినా దీపం ఆరదు. ప్లాస్టిక్ డబ్బాలకు అడుగులు కత్తిరించి చుట్టూరా రంధ్రాలు చేసి బోర్లించినా ప్రమిదల్లో దీపాలు ఆరవు. ప్రమిద సైజును అనుసరించి వెడల్పుగా ఉండే డబ్బాలను ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభిస్తున్న ‘దియా ప్రొటెక్టర్’ కవర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
గాలి వీచే దిశకు వ్యతిరేకంగా గోడవారగా లేదా కుండీ పక్కన దీపం పెట్టవచ్చు.
నాణ్యమైన పత్తితో ఒత్తులు తయారుచేసుకోవాలి. వీటిని నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిలో కొద్దిసేపు నానబెట్టాలి. తరువాతనే ఆ ఒత్తులను ప్రమిదల్లో ఉంచి నూనె పోసి వెలిగించాలి.
ఒత్తులను మరీ పొడవుగా లేదంటే మరీ చిన్నగా చేయకూడదు. ప్రమిద కొనలో తగినంత మేర ఒత్తిని ఉంచి వెలిగించాలి. మంట ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా మధ్య స్థాయిలో వెలిగేలా ఒత్తులను సరిచేయాలి.
దీపాలను ఇంటి ఆవరణలో వెలిగించేటట్లయితే వాటిని ఓ పెద్ద పళ్లెంలో అమరిస్తే గాలికి ఆరిపోవు. ఆ పళ్ళేన్ని అందంగా అలంకరించుకోవచ్చు.
వత్తుల కొనలకు కొద్దిగా కర్పూరం పొడి లేదా నెయ్యిని రాసి వెలిగిస్తే ఎంత పెద్ద గాలి వీచినా అవి ఆరిపోవు. ఎక్కువసేపు వెలుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..