అయోధ్యపై దుష్టశక్తుల చూపు పడనివ్వం: యోగి ఆదిత్యనాథ్
ABN , Publish Date - Nov 08 , 2026 | 11:31 AM
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అయోధ్యలో దళిత సమాజానికి చెందిన నిషాద్ వర్గం ప్రజలతో కలిసి ఆయన పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం నిషాద్ బస్తీని సందర్శించిన సీఎం.. స్థానికులు, చిన్నారులతో ముచ్చటించారు.
అయోధ్య, నవంబర్ 8: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అయోధ్యలో దళిత సమాజానికి చెందిన నిషాద్ వర్గం ప్రజలతో కలిసి ఆయన పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇవాళ (ఆదివారం) నిషాద్ బస్తీని సందర్శించిన సీఎం.. స్థానికులు, చిన్నారులతో ముచ్చటించారు. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, మిఠాయిలు, పండుగ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య పవిత్రతకు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఇకపై ఎవరూ వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. అయోధ్య వైభవాన్ని దెబ్బతీసే శక్తులకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని ప్రజలు దృఢ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో అయోధ్యలో రామభక్తులపై కాల్పులు జరిగిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. ఇకపై ఇక్కడ శ్రీరాముడి భక్తులపై కాల్పులు జరగవని, 'జై శ్రీరామ్' అని నినదించే భక్తులపై ఎవరూ లాఠీలు, కర్రలు ప్రయోగించే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం అయోధ్య పేరు వినగానే ప్రజలు ముఖం తిప్పుకునేవారని యోగి పేర్కొన్నారు. నేడు దేశంలో ఎక్కడికి వెళ్లినా అయోధ్య ప్రజలకు గౌరవ స్వాగతం లభిస్తోందని, వారిని ఆలింగనం చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారని సగర్వంగా చెప్పారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆదర్శాలను కూడా సీఎం ప్రస్తావించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరడమే సుపరిపాలన విజయానికి నిదర్శనమన్నారు. ఇదే బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్ భావననీ పేర్కొన్నారు. వేల సంవత్సరాల క్రితం శ్రీరాముని పునరాగమనాన్ని ఈ నగర వేడుకలు గుర్తుచేస్తాయని చెప్పుకొచ్చారు. అందుకే తాను దీపావళిని అయోధ్యలోనే జరుపుకోవడానికి ఇష్టపడ్డానని అన్నారు. ఈ సంప్రదాయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు..
ఇథియోపియాలో అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ గుర్వీందర్.. ఢిల్లీకి తరలింపు..