Share News

దీపావళి వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు..

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:38 AM

దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు..
Diwali Greetings 2026

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీపావళి ఐక్యత, సోదరభావం, చెడుపై మంచి విజయానికి ప్రతీక అని తమ సందేశాల్లో పేర్కొన్నారు.


ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్..

దేశవ్యాప్తంగా దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా సంబోధిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ (ఆదివారం) ఉదయం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో స్పందించిన మోదీ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.


ఐక్యత, సౌభ్రాతృత్వానికి దీపావళి ప్రతీక: రాష్ట్రపతి ముర్ము

మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. పండుగ వేళ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, సమాజంలో ఐక్యతను పెంపొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితం ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధితో వెలుగులమయం కావాలని ముర్ము ఆకాంక్షించారు.


శుభాకాంక్షలు తెలిపిన యోగి, ఒమర్ అబ్దుల్లా..

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సత్యం, ధర్మం, ఐక్యత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మరోవైపు, అయోధ్యలో నిర్వహించిన పదో దీపోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమితో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, ప్రాంగణాల్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీపోత్సవం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీక అని పేర్కొన్నారు. చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని దీపావళి చాటిచెబుతుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేడు వందేళ్ల వయసులోకి ఆడ్వాణీ

భగవద్గీతే దారిచూపింది

Updated Date - Nov 08 , 2026 | 08:38 AM