నేడు వందేళ్ల వయసులోకి ఆడ్వాణీ
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:05 AM
రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపక అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ నూరో వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.
న్యూఢిల్లీ, నవంబరు 7: రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపక అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ నూరో వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. 1927 నవంబరు 8న జన్మించిన ఆయన 99 ఏళ్లు పూర్తి చేసుకొని ఆదివారం వందో సంవత్సరంలోకి ప్రవేశించనున్నారు. ఆయన పుట్టిన రోజుతో పాటు, దీపావళి కూడా కావడంతో ఈ సందర్భంగా బీజేపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అడ్వాణీ కుమార్తె ప్రతిభ తదితరులు పాల్గొననున్నారు.