అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్.. పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణలు..
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:44 PM
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కోల్‌కతాలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘర్షణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కోల్‌కతాలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘర్షణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. వీటిలో ఒక కేసులో అభిషేక్ బెనర్జీ పేరును కూడా చేర్చారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు (Abhishek Banerjee FIR).
నవంబర్ 7న అభిషేక్ బెనర్జీ తన 39వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న ఆయన నివాసం వద్ద టీఎంసీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.30 గంటల మధ్య అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం మొదలై క్రమంగా ఘర్షణలకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు గాయపడినట్లు సమాచారం. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి (Kolkata Clashes).
కాగా, తన నివాసం, కార్యాలయంపై బీజేపీకి చెందిన వ్యక్తులు దాడి చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు (Abhishek Banerjee Birthday). అంతకుముందు రెండు రోజులుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన నివాసం, కార్యాలయం వద్ద నిఘా పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు తన ఇంటిపై దాడి జరిగిందని, ఈ ఘటనలో పోలీసుల సమక్షంలోనే హింస చోటుచేసుకుందని ఆరోపించారు. తనపై ఆరు నెలల్లో ఏడోసారి హత్యాయత్నం జరిగిందని కూడా పేర్కొన్నారు. ఘటన అనంతరం తన నివాసం బయట నిరసనకు దిగారు. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అక్కడికి చేరుకుని అభిషేక్‌కు మద్దతుగా నిలిచారు.
ఇవి కూడా చదవండి..
మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..