Share News

మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Nov 08 , 2026 | 07:44 AM

భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవాలనే ఉద్దేశంతో కొందరు అభిమానులు చేసిన పని ఆయనకు ఆగ్రహం తెప్పించింది.

మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..
Virat Kohli Viral Video

ఇంటర్నెట్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవాలనే ఉద్దేశంతో కొందరు అభిమానులు చేసిన పని ఆయనకు ఆగ్రహం తెప్పించింది. అభిమానులు మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్లను విసరడంతో కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Virat Kohli Viral Video).


భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న కొందరు చిన్నారులు కోహ్లీ నుంచి ఆటోగ్రాఫ్ పొందాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ బ్యాట్లను మైదానంలోకి విసిరారు. అభిమానులు విసిరిన బ్యాట్లు బౌండరీ సమీపంలో పడటాన్ని గమనించిన కోహ్లీ వాటిని తీసుకున్నాడు (Kohli Angry Reaction).


అభిమానులు ఈ విధంగా మైదానంలోకి వస్తువులు విసరడంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు (IND vs NZ 2nd ODI). బ్యాట్లను తిరిగి బయటకు పంపిస్తూ, మరోసారి ఇలా చేయవద్దన్నట్లుగా చేతులతో హెచ్చరించాడు. కోహ్లీ స్పందించిన తీరు ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, సంమయనం పాటిస్తూ స్పందించిన తీరుపై చాలా మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి:

పసుపు పాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

వరుణుడి అండతో గట్టెక్కారు

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

Updated Date - Nov 08 , 2026 | 07:44 AM