వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
ABN , Publish Date - Nov 08 , 2026 | 07:15 AM
వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే? 8 - 14 నవంబర్ 2026, పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమ వుతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు అధికం. ధనానికి లోటుండదు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకో వద్దు. అజ్ఞాత వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. శుభలేఖ అందుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చి పుచ్చుకుంటారు. ముఖ్యుల రాక సంతోషం కలిగిస్తుంది. పనులు పురమాయించవద్దు. ఖర్చులు అధికం, పొదుపు ధనం గ్రహిస్తారు. సంతోషంగా గడుపుతారు. పిల్లల అత్యుత్సా హం అదుపు చేయండి. కొత్త సమస్య తలెత్తే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. సమయస్ఫూర్తిగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, పనిభారం. ప్రముఖు లతో పరిచయాలు బలపడతాయి. ఆహ్వానం, పత్రాలు అందుతాయి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిపుణులను సంప్రదిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవటం ఉత్తమం. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందు గానే గ్రహిస్తారు. సామరస్యంగా సమస్య పరిష్కరించుకోండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశ మనం కలిగిస్తాయి. కొత్త యత్నాలు చేపడతారు. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. పిల్లలకు శుభయోగం.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సర్వత్రా యోగదాయకమే. ధనలాభం. వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పనులు అనుకున్నవిధంగా పూర్తిచేస్తారు. పరిచయాలు బలపడతాయి. రుణవిముక్తులవుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందు కేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల దూకుడు వివాదాస్పదమవుతుంది. విజ్ఞతతో సమస్య పరిష్కరించుకుంటారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
మీదైన రంగంలో అనుభవం గడిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరు స్తాయి. సామరస్యంగా మెలగండి. మిమ్ము లను తప్పుపట్టిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దైవదీక్షలు, సభ్యత్వం స్వీకరిస్తారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలించవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కార్యసాధనకు ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ప్రతీ విషయం స్వయంగా తెలుసుకోండి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త విషయాలు తెలుసు కుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. పనులు ఏమాత్రం ముందుకు సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఖర్చులు విపరీతం. ప్రతీ వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పిల్లలకు మంచి ఫలితాలున్నాయి. ఆరోగ్యం మందగిస్తుంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
మీదైన రంగంలో పురోభివృద్థి సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఆప్తులకు చేయూతనిస్తారు. సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహమార్పు చేపడతారు. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అన్ని విధాలా యోగదాయకం. శుభవార్త వింటారు. శ్రమఫలిస్తుంది. సంప్రదింపులు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందు కుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా తెలియజేయండి.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News