Share News

ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:50 AM

ఏపీ మద్యం కేసులో తెలంగాణ హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో తెలిపింది.

ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్
AP Liquor Case

అమరావతి, నవంబర్ 12: ఏపీ మద్యం కేసులో తెలంగాణ హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో తెలిపింది. వీరు బెయిల్‌పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ పేర్కొంది. ఈడీ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్ట్ విచారణ చేయనుంది.


ఏపీ లిక్కర్ రవాణా వ్యవహారంలో కొద్దిరోజుల క్రితమే ఏ1గా ఉన్న రాజ్‌కసిరెడ్డి, ఏ2గా ఉన్న వాసుదేవ్‌రెడ్డికి ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కిందికోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు రూ.200 కోట్ల వరకు మనీలాండరింగ్‌‌కు పాల్పడ్డారనే అభియోగాలను ఈడీ మోపుతోంది. ఈ కేసులో వీరిద్దరూ కీలక వ్యక్తులని, కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో వీరు బెయిల్‌పై బయట ఉన్నట్లైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందని.. కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది.


ఈ కేసులో రూ.441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేయడంతో.. ఐటీ కూడా రంగంలోకి దిగింది. ఏపీ సిట్‌తో పాటు ఈడీ, ఐటీ ఈ మూడు దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతున్న సమయంలో ఏ1, ఏ2లు బెయిల్‌పై బయట ఉంటే కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. వీరికి బెయిల్‌ను రద్దు చేస్తూ.. వెంటనే సరెండర్ అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ పిటిషన్‌లో పేర్కొంది. విచారణ చేపట్టిన అనంతరం.. ఇరు వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

జనసేన నేతల పేర్లతో ఏడు కోట్ల రూపాయల మోసం..!

విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 12:06 PM