Share News

విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం..

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:50 AM

విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో 31వ సీఐఐ భాగస్వామ్య 2026 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం..
CII Partnership Summit

విశాఖపట్టణం, నవంబర్ 12: విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో 31వ సీఐఐ భాగస్వామ్య 2026 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్.. సదస్సు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అతిథులకు థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యంతో డప్పులతో కళాకారులు స్వాగతం పలికారు.


సీఎం, కేంద్ర మంత్రి, డిప్యూటీ సీఎం.. స్వయంగా డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచారు. వివిధ కళా బృందాల వద్దకు వెళ్లి కళాకారులతో వారు ఫొటోలు దిగారు. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించిన సీఎం, డిప్యూటీ సీఎం వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆపై ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్‌ను కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించారు.


ఏ ప్రాంతాల్లో ఏయే పంటలు పడుతున్నాయి, ఏయే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయాన్ని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటిల్ స్క్రీన్ చూపుతూ కేంద్రమంత్రికి మంత్రి లోకేశ్ వివరించారు. వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధికి చెందిన గ్రోత్ స్టోరీలను పీయూష్ గోయల్‌కు సీఎం వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధి, దేశాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను డిజిటల్ స్క్రీన్స్ మీద అధికారులు ప్రదర్శించారు. 31వ సీఐఐ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

జనసేన నేతల పేర్లతో ఏడు కోట్ల రూపాయల మోసం..!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 11:20 AM