Share News

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

ABN , Publish Date - May 08 , 2026 | 12:17 PM

వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి.

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!
AP Govt, New School Textbooks

  • అనంత జిల్లాకు 10,07,776..

  • శ్రీసత్యసాయికి 7,04,260..

  • ఒకటి నుంచి 8వ తరగతి వరకు పుస్తకాలు మార్పు

  • గోదాముల నుంచి మండలాలకు తరలింపు

  • విద్యార్థులు, టీచర్ల హర్షం

అనంతపురం: వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి. జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలను మండల స్టాక్‌ పాయింట్లకు తరలిస్తున్నారు. సెలవులు ముగిసేలోగా పాఠ్యపుస్తకాలు బడిలో ఉండాలన్న లక్ష్యంతో వాటిని తరలిస్తున్నారు. బడి తలుపులు తెరిచిన వెంటనే విద్యార్థులకు వాటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈసారి ఒకటి నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకలు మారాయి. 9, 10తరగతులకు పాత విధానంలోనే ఉంటాయి. పుస్తకాలు మారినా కొత్తవాటిని ముద్రించి జిల్లాలకు పంపారు. వాటిని పాఠశాలల పాయింట్లకు తరలించేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది.


అనంతకు 10,07,776 పుస్తకాలు

2026-27 విద్యా సంవత్సరానికి అనంతపురం జిల్లాకు 10,07,776 పాఠ్యపుస్తకాలు అవసరమని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదికలు పంపింది. ఆ మేరకు మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేసి పంపారు. ఇందులో పాఠ్యపుస్తకాలు 8,00,912, వర్క్‌బుక్స్‌ 1,73,504, నిఘంటవులు 15,724, ఉర్దూ, కన్నడ పుస్తకాలు 5,062 జిల్లాకు వచ్చాయి.


శ్రీసత్యసాయి జిల్లాకు 7,04,260..

శ్రీసత్యసాయి జిల్లాకు సంబందించిన పాఠ్యపుస్తకాలు అనంతపురం గోదాము నుంచే సరఫరా చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాకు 7,04,260 పుస్తకాలు అవసరమని నివేదికలు పంపారు. ఆ మేరకు అనంత జిల్లా గోదాముకు పంపారు. ఇందులో మొదటి సెమిస్టర్‌కు సంబంధించి పాఠ్యపుస్తకాలు 5,58,154, వర్క్‌బుక్స్‌ 1,14,486, నిఘంటువులు 9,959, ఉర్దూ పాఠ్యపుస్తకాలు16,471, కన్నడ పుస్తకాలు 5,190 ప్రభుత్వం పంపింది.


zz.jpgమండల స్టాక్‌ పాయింట్లకు తరలింపు

ప్రభుత్వం నేరుగా పాఠ్యపుస్తకాలను జిల్లా గోదాముకు పంపింది. ఇక్కడకు ఒకేసారి పాఠ్య పుస్తకాలు రావడంతో గోదాములో నిల్వ ఉంచడానికి ఇబ్బందిగా మారింది. దీంతో మార్కెట్‌ యార్డులో ఉన్న ఓ గోదామును అద్దెకు తీసుకున్నారు. పాత, కొత్త గోదాముల్లో పాఠ్యపుస్తకాలను నిల్వ ఉంచారు. వాటి తరలింపునకు విద్యాశాఖ యంత్రాంగం చర్యలు మొదలుపెట్టింది. ఆ మేరకు గురువారం తరలింపును ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.


జూన్‌ 12లోగా పాఠశాలలకు విద్యామిత్ర కిట్లు

విద్యామిత్ర కిట్లను జూన్‌ 12వ తేదీలోగా బడులకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. యూనిఫాం, షూ్‌స, బెల్టులు, బ్యాగులు నేరుగా రాష్ట్రస్థాయి నుంచే సరఫరా చేస్తున్నారు. పాటశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్‌, బెల్లు, బ్యాగ్‌తో కలిపి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ల పేరుతో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేయనున్నారు. మెగా పేరెంట్స్‌ డే జూన్‌ 19న ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలోగా విద్యార్థులకు కిట్లు అందించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి:

సిజ్జు.. రూ.5 లక్షలు

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2026 | 12:17 PM