ధరల పెంపుపై ప్రకటన.. బ్రిటానియా కంపెనీ షేర్ల పతనం
ABN , Publish Date - May 08 , 2026 | 11:55 AM
తమ కంపెనీ ఉత్పత్తుల ధరలు పెంచుతామని బ్రిటానియా ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ల ధర 5 శాతం మేర పతనమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తన ఉత్పత్తుల ధరలు పెంచేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని తాజాగా తన మదుపర్లకు తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు 5 శాతం మేర పతనమయ్యాయి. ప్రస్తుతం 4.99 శాతం నష్టంతో రూ.5,524 వద్ద ట్రేడవుతోంది.
ఇక 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో తమ నికర లాభాం 21.2 శాతం మేర పెరిగి రూ.678 కోట్లకు చేరినట్టు కూడా కంపెనీ నిన్న ప్రకటించింది. యూఎస్-ఇరాన్ యుద్ధ ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరంలో తమపై ఉండదని కూడా బ్రిటానియా వెల్లడించింది. ఇక ఈక్విటీ షేర్లపై కంపెనీ రూ.90.50 డివిడెండ్‌ను ప్రకటించింది. మొత్తం రూ.407.88 కోట్లను షేర్ హోల్డర్‌లకు పంపిణీ చేసినట్టు కూడా పేర్కొంది.
మరో ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం డాబర్ ఇండియా కూడా తమ ఉత్పత్తుల ధరలు పెంచే విషయమై ఆలోచిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 4 శాతం మేర ధరల పెంపుపై యోచిస్తున్నట్టు సమాచారం. ముడి సరకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డాబర్ ఇండియా ధరల పెంపుపై యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలో తొలి స్పేస్ టెక్ యూనికార్న్‌గా స్కైరూట్