పశ్చిమ బెంగాల్‌కు అమిత్ షా.. సీఎం అభ్యర్థి ఎన్నికపై కీలక భేటీ..
ABN , Publish Date - May 08 , 2026 | 11:24 AM
పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశానికి నేటితో తెరపడనుంది. సీఎం అభ్యర్థిని బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు (శుక్రవారం) ఎన్నుకోనున్నారు. ఇందు కోసం కోల్‌కతాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్తున్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశానికి నేటితో తెరపడనుంది. సీఎం అభ్యర్థిని బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు (శుక్రవారం) ఎన్నుకోనున్నారు. ఇందు కోసం కోల్‌కతాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్తున్నారు. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలతో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో పార్టీ శాసనసభ నాయకుడిని ఖరారు చేయనున్నారు. కాగా, ఎన్నికైన అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి పదవి కోసం పశ్చిమ బెంగాల్ బీజేపీ అగ్రనేతలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో సువేందు అధికారి పేరు తొలి వరుసలో ఉంది. బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ముందుండి నడిపించారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని భవానిపూర్ నియోజకవర్గంలో ఓడించారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఆయన వైపే మెుగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సువేందుతోపాటు ముఖ్యమంత్రి పదవి కోసం దిలీప్ ఘోష్, సమీక్ భట్టాచార్య, అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ సహా పలువురు నేతలు పోటీ పడుతున్నారు.
ఈ సమావేశంలో ఎన్నికైన అభ్యర్థి శనివారం ఉదయం 10 గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ శ్రేణులు హాజరుకానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
విమానంలో టీఎంసీ మహిళా ఎంపీకి చేదు అనుభవం.. ఇండిగోకు ఫిర్యాదు..
రాజీనామా చేయని మమతా బెనర్జీ.. రాజ్యాంగం ఏం చెబుతోందంటే..?